ప్రజా అర్జీలను సత్వరమే పరిష్కరించాలి:కలెక్టర్

సూర్యాపేట జిల్లా:ప్రజా అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఎస్.వెంకట్రావ్( S.

Venkatrav ) ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఆదనవు కలెక్టర్లు పాటిల్ హేమంత కేశవ్,ఎస్.

Public Grievances Should Be Dealt With Promptly Collector , Patil Hemanta Keshav

మోహన్ రావు( Patil Hemanta Keshav, S.Mohan Rao ) లతో కలసి అర్జీదారులనుండి దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ భూసమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా అందుతున్నాయని ధరణి సైట్ లో అర్జీదారులు సరైన రీతిలో పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని, తద్వారా వివిధ రకాల భూముల సమస్యలకు పరిష్కారం సులువుగా పరిష్కరించబడుతాయని అన్నారు.

వేసవి దృష్ట్యా వడదెబ్బ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అన్నారు.అన్ని పిహెచ్ సి లలో మందుల కొరత లేకుండా ఉండాలని సూచించారు.అలాగే అన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి ఎక్కడ రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పశువుల నీటి తొట్టిలలో నీటిని నింపి ఉంచాలని, అలాగే నాటిన మొక్కలకు సంవృద్దిగా నీటిని అందించాలని సూచించారు.

Advertisement

ప్రజావాణిలో భూసమస్యలపై 39 దరఖాస్తులు,ఇతర శాఖలకు సంబంధించి 13 మొత్తం 52 దరఖాస్తులు అందాయని తెలిపారు.అనంతరం తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నల్గొండ వారి ఆధ్వర్యంలో పర్యావరణ మిషన్ లైఫ్ పై గోడపత్రికను ఈ ఆవిష్కరించి ప్రజలకు పర్యవరణహిత జీవన శైలిపై అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News