నీళ్ల కోసం ఖాళీ బిందెలతో నిరసన

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం శాంతినగర్ ఎస్సీ కాలనీలో గత రెండు నెలల నుండి నీటి కొరత ఏర్పడి నానా ఇబ్బందులు పడుతున్నామని కాలనీ మహిళలు శనివారం ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ రెండు నెలల నుండి ఎస్సీ కాలనీలో మంచినీళ్లు సమస్య తీవ్రంగా వేధిస్తోందని,నీళ్ల కోసం కిలో మీటర్ దూరం వెళ్లి, బిందెలతో తెచ్చుకుంటున్నామని వాపోయారు.

మా సమస్యను నేటికీ తీర్చకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉందని, అధికారులు ఇప్పటికైనా స్పందించి నీటి సమస్య లేకుండా చూడాలని కోరారు.

Protest With Empty Buckets For Water, Protest ,empty Buckets , Water, Drinking W
కూరగాయల కొనుగోలులో సామాన్యుడికి తప్పని తిప్పలు

Latest Suryapet News