BRS Protest : ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు

రాష్ట్ర ప్రభుత్వ ఎల్ఆర్ఎస్ పై చార్జీల పెంపు( LRS Charges )ను వ్యతిరేకిస్తూ బుధవారం బీఆర్ఎస్ అధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జిల్లా, నియోజకవర్గాల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఎల్ ఆర్ఎస్ కొరకు రాష్ట్ర వ్యాప్తంగా 25.

44 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని,వారిపై 20 వేల కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ చేసుకున్న వారిపై భారం మోపద్దని డిమాండ్ చేసి,అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటనలకే పరిమితమైందని ఆరోపించారు.

ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేసేవరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరుపున పోరాడుతుందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా పెట్టిన సంక్షేమ పథకాలను ఏమీ లేవని,తమ ప్రభుత్వం ఇచ్చిన వాటినే కొనసాగిస్తుందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ఎలాంటి ఛార్జీలు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
దేవరకొండ యువతి గిన్నిస్‌ బుక్‌ రికార్డు

Latest Nalgonda News