ఎస్సారెస్పీ కాల్వకు నీటి విడుదల చేయాలని కాలువలో నిరసన

సూర్యాపేట జిల్లా:ఎస్సారెస్పీ వరద కాల్వ ద్వారా పంట పొలాలకు సాగునీటిని అందించాలని,కళ్ళముందే పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని గ్రామీణ పేదల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనకంచి వీరభద్రయ్య అన్నారు.

ఎస్సారెస్పి కాల్వల ద్వారా నీటిని విడుదల చేసి పంట పొలాలకు సాగునీటిని అందించాలని కోరుతూ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం మొగ్గయ్యగూడెం వద్ద రైతులతో కలిసి ఎస్సారెస్పీ కాలువలో నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు.కాల్వ వస్తుందనే ఆశతో నాట్లు వేశామని,ఇప్పుడు నీరు ఇవ్వకుంటే రైతులకు ఎకరాకి రూ.25 వేల నష్టం వాటిల్లితుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌ నిండా నీళ్లు నిల్వ ఉన్నా సాగునీరు విడుదల ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అధికారులకు ఎన్నిసార్లు మెరపెట్టుకున్నా కనికరం చూపిస్తలేరని, పంటల కోసం పెట్టిన పెట్టుబడులు భారంగా మారాయన్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి పంట పొలాలలకు సాగు నీరు అందివ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్ఓ జిల్లా కార్యదర్శి భాషిపంగు సునీల్,అనంతుల యల్లయ్య,వెంకన్న, ఉప్పలయ్య,వెంకటనర్సు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Advertisement
సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

Latest Suryapet News