వీధి పందుల బెడద నుంచి పంటలను కాపాడండి

సూర్యాపేట జిల్లా:వీధి పందుల బెడద నుంచి పంటలను కాపాడి తమను ఆదుకోవాలని జిల్లా కేంద్రంలోని గిరినగర్ కు చెందిన రైతులు జిల్లా కలెక్టర్ ను వేడుకున్నారు.

సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ఆరో వార్డు గిరినగర్ లో ప్రాంతంలో సర్వేనెంబర్ 44,45 లో వరి పంట సాగు చేశామని, తీర కోతకొచ్చే సమయంలో ప్రతిరోజు 20 నుంచి 30 కి పైగా వీధి పందులు గుంపులుగా వస్తూ పంటను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో నివాస గృహాలు అధికంగా ఉండడంతో పందులు నిత్యం స్వైర విహారం చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే ఎదురుదాడికి పాల్పడుతూ తీవ్రంగా గాయపరుస్తున్నాయని వాపోయారు.

Protect Crops From The Menace Of Stray Pigs, Protect Crops , Menace ,stray Pigs,

ఇదే విషయమై మున్సిపాలిటీ అధికారులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.ఇప్పటికైనా స్పందించి పందుల బెడద నుండి వరి పంటను రక్షించి ఆదుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రైతులు నరసింహ,రమణ,డానియల్ పాల్గొన్నారు.

Advertisement
పెద్దగట్టును దర్శించుకున్న మంత్రి ఉత్తమ్

Latest Suryapet News