అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి: పి.జయలక్ష్మి

సూర్యాపేట జిల్లా: గత ప్రభుత్వం,ప్రస్తుత ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలనితెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్(సిఐటియు అనుబంధ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.

జయలక్ష్మి అన్నారు.

బుధవారం జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన అంగన్వాడీ ఉద్యోగుల సమావేశానికి ఆమె హాజరై మాట్లడుతూ అంగన్వాడీ ఉద్యోగులను అనేక సమస్యలు వేధిస్తున్నాయని,చాలా మందికి మధ్య మధ్యలో వేతనాలు రాలేదని,రూమ్ రెంట్ల సమస్య తీవ్రంగా ఉందని,షరతులు పెట్టడం, ప్రతినెల ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దీనికి తోడు బిఎల్ఓ డ్యూటీలు, సర్వేల వంటి అదనపు పనులతో పనిభారం పెరిగిందన్నారు.

Promises Given To Anganwadis Should Be Implemented P Jayalakshmi, Anganwadis ,

పని భారం వల్ల ఐసిడిఎస్ నిర్వహించటం సాధ్యం కావట్లేదని,ఐసిడిఎస్ కు నష్టం జరుగుతుందని, ఇంకా అనేక సమస్యలు అంగన్వాడీ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారన్నారు.జనవరి నెల వేతనాలు ఇంకా రాలేదని అన్నారు.

ఈ సమస్యలను జిల్లాలో ఉన్న అధికారులు వెంటనే పరిశీలించి పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ ఏకలక్ష్మి, సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రాంబాబు,నెమ్మాది వెంకటేశ్వర్లు,అంగన్వాడీ ఉద్యోగులు రజిత, లింగమ్మ,సంతోష, మంజుల,హుస్సేనీ, సైదమ్మ,రమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News