ఆ ఏరియాలో ఉన్న ప్రాపర్టీని అమ్మేసిన చిరంజీవి.. ఎన్ని రూ.కోట్లంటే?

మెగాస్టార్ చిరంజీవికి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.చిరంజీవి హీరోగా సంపాదించిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని స్థలాలపై పెట్టుబడి పెట్టారు.

 Prime Property Sold By Megastar Chiranjeevi Details Here Goes Viral,megastar Chi-TeluguStop.com

అప్పట్లో లక్షల్లో చిరంజీవి ఖర్చు చేసిన ప్రాపర్టీల విలువ ప్రస్తుతం కోట్ల రూపాయలుగా ఉంది.ఫిల్మ్ నగర్ లో చిరంజీవి 3,000 గజాల ప్రాపర్టీని చాలా సంవత్సరాల క్రితం 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు.

అయితే ఆ స్థలాన్ని చిరంజీవి ఇప్పుడు అమ్మేశారని బోగట్టా.

నిజానికి చిరంజీవి దగ్గర వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి.

ప్రాపర్టీలను కొనే అవసరమే తప్ప అమ్మే అవసరం చిరంజీవికి ఏ మాత్రం లేదు.అయితే 70 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఆఫర్ రావడంతో చిరంజీవి ఆ ఆఫర్ కు వెంటనే ఓకే చెప్పారని సమాచారం.

చిరంజీవి నుంచి ప్రముఖ దినపత్రిక యజమాని ఈ ప్రాపర్టీని కొనుగోలు చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

Telugu Chiranjeevi, God-Movie

మరోవైపు ఈ నెల 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన వరుస అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.చిరంజీవి ఈ సినిమాతో పాటు భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలలో కూడా నటిస్తున్నారు.

ఈ రెండు సినిమాలపై కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే.చిరంజీవి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను అందుకోవాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube