చాలామంది హీరో హీరోయిన్లు నటీనటులు వారికి తోచిన విధంగా సహాయం చేస్తూ ఉంటారు.అలా టాలీవుడ్ లో ఇప్పటికీ ఎంతోమందికి సహాయం చేస్తూ గొప్ప మనసును చాటుకుంటున్న సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు.
అయితే కొంతమంది సహాయం కాని సేవ కాని చేస్తే అందులో పబ్లిసిటీని కోరుకుంటూ ఉంటారు.కొందరు మాత్రం అలాంటివి ఏవి పట్టించుకోకుండా వారు సహాయం చేసిన విషయం మరో మనిషికి తెలియకుండా సహాయం చేసేస్తూ ఉంటారు.
అలాంటి వాళ్ళు హీరో ప్రభాస్( Prabhas ) కూడా ఒకరు.ఇప్పటివరకు ప్రభాస్ ఎంతోమందికి సహాయం చేసి తన గొప్ప మనసుని చాటుకున్నారు.

అయితే అందులో కొన్ని బయటపడగా బయటపడని సేవలు దానాలు ఎన్నో ఉన్నాయి.ప్రభాస పబ్లిసిటీ కోరుకోరు.గతంలో ప్రభాస్ ఒక వీరాభిమాని మరణం అంచున చేరుకొని ప్రభాస్ ని కలిసి ఫోటో దిగాలని కోరుకుంటే ప్రభాస్ అప్పటికప్పుడు తన షెడ్యూల్స్ అన్ని వాయిదా వేసుకుని ఆ అభిమానిని( Prabhas Fan ) కలిసి అతని కిష్టమైన ఫుడ్ కూడా ఇచ్చారు.ఆ విషయం ఆ అభిమాని పేరెంట్స్ చెప్పేవరకు ఎవ్వరికి తెలియదు.
గతం లోనూ ప్రభాస్ వృద్ధాశ్రమం( Oldage Home ) నిర్మించడంలో సహాయం కోసం అర్ధించగా రెండు కోట్లు సహాయం చేసిన విషయం ఎవ్వరికి తెలియదు.తాజాగా నటుడు శివాజీ రాజా ( Actor Shivaji Raja ) ప్రభాస్ చేసిన ఈ పెద్ద సహాయం గురించి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

శివాజీ రాజా కొందరితో కలిసి వృద్దాశ్రమం నిర్మించేటప్పుడు ప్రభాస్ ని సహాయం అడగడానికి వెళ్లగా వెంటనే రెండు కోట్లు ఆ వృద్ధాశ్రమానికి విరాళం ఇచ్చినట్టుగా ఆ ఇంటర్వ్యూలో చెప్పడం హైలెట్ అయ్యింది.ప్రభాస్ ఇలాంటి సహాయాలు చాలా చేసినా అవి ఎవ్వరికి తెలియవు, అవి తెలియడానికి ఏళ్ళకి ఏళ్ళు పడుతుంది అంటూ ఆయన సన్నిహితులు చెప్పడం గమనార్హం.మరి రెండు కోట్ల ఎమౌంట్ చిన్న విషయం కాదు, కానీ ప్రభాస్ మాత్రం నిస్వార్థంగా సేవ చేస్తూ ఎలాంటి పబ్లిసిటీ కోరుకోకపోవడం ఆయన్ని మరింత ఉన్నతస్థానంలో నిలబెట్టింది.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది కదా ప్రభాస్ అంటే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.