రాజన్న సిరిసిల్ల జిల్లా: విలేకరులమని చెప్పి లారీని అడ్డగించి లారీ ఓనర్ ను భయపెట్టి 20,000/- రూపాయలు వసూలు చేసిన ఐదుగురు వ్యక్తులపైన తంగాలపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందని సిరిసిల్ల డిఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ….
తేదీ 30-03-2024 రోజున సాయంత్రం అందాజ ఐదు గంటలకు వేములవాడలోని వరలక్ష్మి రైస్ మిల్ నుండి 600 వడ్ల బస్తాలను తీసుకుని సిద్దిపేటకు వెళుతున్న లారీని జిల్లేల వరకు వెంబడించి,లారీని అడ్డగించి డ్రైవర్ ద్వారా ఓనర్ వివరాలు తెలుసుకొని ఓనర్ కు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని లేనిచో సంబంధిత అధికారులకు చెప్పి వడ్లపై కేసు నమోదు చేపిస్తామని బెదిరించగా వేములవాడలో ఉన్న రైస్ మిల్లు యజమాని జిల్లెలకు రాగా అక్కడ ఉన్న ఐదుగురు వ్యక్తులు 1పొన్నం.చంద్రమౌళి.2.దూస.రాజేందర్.3.చౌటపల్లి.వెంకటేష్.4.అవునూరి.ప్రశాంత్.5.నరేష్.లను కలవగా అట్టి వ్యక్తులు మేము విలేకరులమని చెప్పి ఇట్టి లారీ అక్రమంగా పోతుందని మాకు డబ్బులు ఇవ్వాలని లేనిచో పై అధికారులకు చెప్తామని భయపెట్టగా రాత్రి సమయం కావడంతో భయానికి గురైన రైస్ మిల్ యజమాని వద్ద నుండి 20వేల రూపాయలు పైన తెలిపిన ఐదుగురు వ్యక్తులు తీసుకున్నారని బాధితుడు తంగాలపల్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నేరానికి పాల్పడిన వ్యక్తులు పరారి లో ఉండగా ఒక విలేకరి చంద్రమౌళిని అరెస్టు చేసి అతని వద్ద నుండి రాత్రి బలవంతంగా తీసుకున్న 20,000/- రూపాయ లు,ఒక హోండా యాక్టివా ద్విచక్ర వాహనం,సెల్ ఫోను స్వాధీన పరచుకోవడం జరిగిందని,
మరియు నేరానికి పాల్పడిన వారిలో చంద్రమౌళిని ఈరోజు రిమాండ్ కు తరలించడం జరిగిందని,పరారీలో ఉన్న మిగిలిన నిందుతులను కూడా అరెస్ట్ చేస్తామని ఆయన చెప్పారు.
ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు.తంగల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారి వివరాలను ఫోన్ నెంబర్ 87126 56370కి లేదా డయల్ 100 కి కాల్ చేసి సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు.







