నేలను తాకేలా కిందికి వచ్చిన విద్యుత్ తీగలు

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి మండల పరిధిలోని కరివిరాల గ్రామంలో వెలుగు వెంకన్న అనే రైతు వ్యవసాయ పొలంలో వారం రోజుల క్రితం వీచిన ఈదురు గాలికి విద్యుత్ లైన్ తెగి స్తంభం కూలిపోయింది.

అదృష్టవశాత్తు వెంటనే కరెంట్ లైన్ బంద్ చేయడంతో పశువులకు మనుషులకు ప్రాణాపాయం తప్పింది.

కరెంటు లైన్ కూలిన స్తంభం మరమ్మతులు చేపట్టాలని విద్యుత్ అధికారులకు లైన్మెన్ కు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని బాధిత రైతు వెలుగు వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు.పొలం దున్నడానికి విద్యుత్ వైర్లు అడ్డుగా ఉన్నాయని విద్యుత్ అధికారులు వెంటనే మరమ్మతులు చేసి తన వ్యవసాయం సాగుకు సహకరించాలని కోరారు.

Power Lines Coming Down To Touch The Ground, Power Lines , Tungaturthi Mandal, S

Latest Suryapet News