మానవత్వం చాటుకున్న పోలీసులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం, వెంకటాపూర్ గ్రామాలలో అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా ప్లాగ్ మార్చ్ నిర్వహిస్తుండగా, అగ్రహారం గ్రామ శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వెళ్లి ఢీ కొనగా ప్రమాదం చోటుచేసుకుంది.

అటువైపుగా ఫ్లాగ్ మార్చ్ చేస్తూ వెళ్తున్న అధికారులు డిఎస్పీ ఉదయ్ రెడ్డి,సి.

ఐ శశిధర్ రెడ్డి, ఎస్.ఐ రమాకాంత్,బి ఎస్ ఎఫ్ సిబ్బంది గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించిన అనంతరం వారిని పోలీస్ వాహనంలో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించడం జరిగింది.ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్ కి పంపించడం వలన ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు అని ఎస్ఐ తెలిపారు.

హనుమాన్ భజన చేసి నిరసన తెలిపిన సిరిసిల్ల జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు

Latest Rajanna Sircilla News