జిల్లాలో ఐదు చెక్ పోస్ట్ లతో పాటుగా ఐదు టీమ్స్ తో డైనమిక్ తనిఖీలు

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నియమావళి( Elections ) ప్రకారం బుధవారం రోజున వేములవాడ పట్టణం కోరుట్ల బస్టాండ్ వద్ద వాహన తనిఖీల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( District SP Akhil Mahajan ).

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.

అసెంబ్లి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకే జిల్లాలో విస్తృత వాహన తనిఖీలు చేపట్టడం జరుగుతుంది అని ప్రజలు, వాహనదారులు ఎన్నికల నియమావళి పాటిస్తూ సహకరించాలన్నారు.జిల్లాలో ఇప్పటివరకూ ఐదు చెక్ పోస్ట్ లు( Checkposts ) ఏర్పాటు చేయడంతో పాటుగా 05 టీమ్స్ ఏర్పాటు చేసి జిల్లాలో డైనమిక్ తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా నగదు, మద్యం, మాదకద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని,ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు జిల్లాలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు.

ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ కరుణాకర్, ఆర్.ఎస్.ఐ శ్రవణ్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ
Advertisement

Latest Rajanna Sircilla News