రహదారిపై పైప్ లైన్ లీకేజీ-పట్టించుకోని అధికారులు

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండల కేంద్రం నుండి సూర్యాపేట వెళ్ళే రహదారిపై పొనుగోడు- మర్రికుంట గ్రామల మధ్య నడి రోడ్డుపై వాటర్ పైప్ లైన్ లీకేజీ కావడం ద్వారా నీరు పైకి ఉబికి వస్తుందని, దానివల్ల రోడ్డు మధ్యలో పెద్ద గుంటలు ఏర్పడి వాహనదారులకు ఇబ్బందిగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం వందలాది వాహనాలు రాకపోకలతో రద్దీగా ఉండే రహదారిపై గుంతల్లో నీరు చేరడంతో అటు వైపుగా వెళ్తున్న వాహనాదారులు పక్కకు వెళ్లడంతో ఎదురుగా వస్తున్న వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు.

దీనితో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయబ్రాంతులకు గురవుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పైప్ లైన్ లీకేజీకి మరమత్తులు చేపట్టి ప్రమాదాలను అరికట్టాలని ప్రయాణీకులు,ప్రజలు కోరుతున్నారు.

Pipe Line Leakage On The Road-unconcerned Authorities, Road-unconcerned Authorit
ఎనిమిది మంది బెట్టింగ్ రాజాల అరెస్టు

Latest Suryapet News