తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఒకరు.తాజాగా ఎన్టీఆర్ ఘాట్ లో( NTR Ghat ) జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు.
బాలయ్య ఆదేశాలతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారని సమాచారం అందుతోంది.ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జరిగిన ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.
తారక్ విషయంలో కఠినంగా వ్యవహరించడం సరికాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్టీఆర్ వర్ధంతి కావడంతో ఈరోజు ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాజరు కావడంతో పెద్దఎత్తున అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు.బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని ఇచ్చిన ఆదేశాలు సరికావని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ తరహా ఘటనల వల్ల బాలయ్య, తారక్ మధ్య గ్యాప్ పెరుగుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను( Jr NTR Flexis ) తొలగించడం గురించి బాలయ్య( Balakrishna ) నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి.ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో బాలయ్య ఈ విధంగా వ్యవహరించడం సరికాదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా( Devara Movie ) షూటింగ్ తో బిజీగా ఉన్నారు.ఈ సినిమా కోసం రేయింబవళ్లు ఎంతో కష్టపడుతున్నారు.

ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు ప్రేక్షకులు కోరుకున్న అన్ని అంశాలు ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఏప్రిల్ నెల 5వ తేదీన విడుదల కానున్న దేవర మూవీ డిజిటల్ హక్కులు 155 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.డిజిటల్ రైట్స్ విషయంలో ఇది సరికొత్త రికార్డ్ అని సమాచారం అందుతోంది.దేవర మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.







