పేటలో పందులు స్వైర విహారం

సూర్యాపేట జిల్లా:పేట మున్సిపాలిటీ సూర్యాపేట శాసనసభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రత్యేక చొరవతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో పట్టణంలో పందులు స్వైరవిహారం చేయడం పలువురిని ఇబ్బందులకు గురిచేస్తుంది.

పేట మున్సిపాలిటీ 16వ వార్డులో అక్షయ అపార్టుమెంట్ వెనుకాల వీధిలో పందుల సంచారం వార్డు ప్రజలను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి.

ఈ ప్రాంతంలో ఇంటిగేటు తీసుంటే చాలు పందులు ఇంటిలోకొచ్చి మొక్కలను,సామగ్రిని ధ్వంసం చేస్తూ నానా బీభత్సం సృష్టిస్తున్నాయని వార్డు వాసులు వాపోతున్నారు.పందుల సంచారం పెరగడం వలన వాటి నుండి వెలువడే దుర్గంధం వలన ఇంటిలోని నుండి బయటికి రావాలంటే ఇబ్బందిగా మారిందని,పందుల వలన మెదడు వాపు వ్యాధి సంక్రమించే అవకాశం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి పట్టణంలో పందుల బెడద లేకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement

Latest Suryapet News