బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని రేవంత్ రెడ్డికి వినతిపత్రం

తెలంగాణలో రానన్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ( Congress party )ప్రతి పార్లమెంటు పరిధిలో మూడు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని కోరుతూ ఢిల్లీలో టిపిసిసి చీఫ్, మల్కాజ్గిరి ఎంపి ఏనుముల రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి గురువారం బీసీ విద్యార్థి సంఘం నేత వీరబోయిన లింగయ్య ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

అదే విధంగా కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించాలని కోరారు.

అనంతరం రాజ్యసభ సభ్యులు,బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలని జంతర్ మంతర్ వద్ద చేస్తున్న నిరసన కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ యాదవ్,బీద మస్తాన్ రావు,మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి లను కలిసి బీసీ డిక్లరేషన్ పై వివరించారు.జనగణనలో కులగణన చేయాలని,చట్టసభల్లో బీసీలకు 55% రిజర్వేషన్ కల్పించాలని,బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలలని,బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మహాధర్న నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బారి అశోక్, ఈదుల రమేష్ చంద్ర, పల్లగొర్ల రాందేవ్ మోడీ, అరవిందు,తెలుగు రాష్ట్రాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్...!
Advertisement

Latest Suryapet News