అక్రమాలకు పాల్పడ్డ రేషన్ డీలర్లపై శాశ్వత చర్యలు తీసుకోవాలి

సూర్యాపేట జిల్లా: ప్రభుత్వం పేద ప్రజలకు అందించే రేషన్ బియ్యంలో అక్రమాలకు పాల్పడ్డ డీలర్లని సస్పెండ్ కాకుండా,విధుల నుండి శాశ్వతంగా తొలగించి,వారి స్థానంలో నూతన డీలర్లని నియమించాలని నేరేడుచర్ల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అరిబండి సురేష్ బాబు,పలువురు గ్రామస్తులు డిమాండ్ చేశారు.

మంగళవారం సురేష్ బాబు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ యందు జిల్లా అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 6న నల్లగొండ జిల్లా దామరచర్ల గ్రామ సమీపంలో 22 టన్నుల పిడిఎస్ రేషన్ బియ్యంతో ఆంధ్రాకు వెళ్తున్న లారీని పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందేనన్నారు.ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలానికి చెందిన డీలర్లు పిడిఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారని చెప్పారు.

Permanent Action Should Be Taken Against The Ration Dealers Who Have Committed I

పేదలకు అందించాల్సిన పిడిఎస్ రేషన్ బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తున్న డీలర్ల పట్ల ప్రభుత్వం అప్రమత్తత వహించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Latest Suryapet News