ప్రైవేట్ హాస్పిటల్స్, ల్యాబ్స్ తీరుపై ప్రజల మండిపాటు

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల( Nereducharla ) పట్టణంలోని రామాపురం రోడ్డులో జనావాసాల మధ్య ప్రైవేట్ ల్యాబ్స్,హాస్పిటల్స్( Private hospitals ) లో వాడిన ఇంజక్షన్లు, నీడిల్స్ ఖాళీ సూది మందు సీసాలు,రక్త నమూనా డబ్బాల వంటి వ్యర్ధాలను గుర్తు తెలియని వ్యక్తులు ఇష్టారీతిన పడేసిన వైనంపై స్థానికులు మండిపడుతున్నారు.

శుక్రవారం రాత్రి వాటినిగమనించిన స్థానికులు ప్రమాదకరమైన వాటిని నిర్లక్ష్యంగా జనావాసాల మధ్య,రహదారికి పక్కనే పడేశారని,అటుగా వెళ్ళే వాహనదారులకు, పాదచారులకు,మూగ జీవాలను సైతం హాని కలిగించే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆస్పత్రి,ల్యాబ్స్ లో ఉపయోగించి పడేసే వ్యర్థాలను జాగ్రత్తగా మూటకట్టి డబ్బాలలో భద్రపరిచి సంబంధిత వ్యక్తులకు అప్పచెప్పవలసి ఉన్నా,అలా చేయకుండా ఎవరూ లేని సమయంలో నిర్లక్ష్యంగా పడేయడం ఏమిటని ప్రశ్నించారు.ఆసుపత్రి,వ్యర్ధాలతోపాటు ల్యాబ్స్( Private LABS ) లో ఉపయోగించిన రక్త నమూనా డబ్బాలు కూడా వ్యర్ధాలలో ఉన్నాయని, వాటి నుంచి వచ్చే దుర్వాసనతో వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వాపోయారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆసుపత్రి వ్యర్ధాలను రోడ్డు పక్కన పడేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని,ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.

ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
Advertisement

Latest Suryapet News