వీడియో : వీరమల్లు మల్ల యుద్దం అదిరింది.. సినిమా ఎప్పుడు భయ్యా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ప్రస్తుతం నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా యొక్క పవర్ గ్లాన్స్ విడుదల చేయడం జరిగింది.పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాగే ఈ సినిమా లో చూపించబోతున్నట్లుగా దర్శకుడు ఈ వీడియో తో చెప్పకనే చెప్పాడు.

 Pawan Kalyan Hari Hara Veeramallu Movie Power Glance , Flim News, Hari Hara Veer-TeluguStop.com

ఎం ఎం కీరవాణి సంగీత సారథ్యం లో అద్భుతమైన నేపథ్య సంగీతం మరియు పాటలు ఉండబోతున్నాయని ఈ వీడియో నేపద్య సంగీతం వింటుంటే అనిపిస్తుంది.ఇక పవన్ కళ్యాణ్ ఈ వీడియో లో మల్ల యోధులతో చేసిన యుద్ధం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నట్లుగా అనిపిస్తుంది.

ఒక విజువల్ వండర్ అన్నట్లుగా ఈ సినిమా ఉంటుందని పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.దర్శకుడు క్రిష్‌ ఈ సినిమాని చాలా నమ్మకం పెట్టి తెరకెక్కిస్తున్నాడు.

దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఏ ఏం రత్నం ఈ సినిమా ని నిర్మిస్తున్నాడు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాల కోసం రామోజీ ఫిలిం సిటీ లో సెట్టింగ్ నిర్మాణం జరుగుతుంది.

గత రెండు మూడు నెలలుగా ఈ సినిమా షూటింగ్‌ జరగలేదు.అందుకు పలు కారణాలు ఉన్నాయి.రాజకీయాలకు ఎక్కువ టైం కేటాయించిన పవన్ కళ్యాణ్ సినిమాలకు తక్కువ సమయం ని కేటాయిస్తున్నాడు.అందువల్లే ఈ సినిమా షూటింగ్లో జాప్యం జరుగుతుంది.

తాజాగా పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా విడుదలైన వీడియో చూసిన తర్వాత అభిమానులు సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ ఏడాది చివరి వరకు షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా దర్శకుడు క్రిష్ ఏర్పాటు చేస్తున్నట్లుగా సినిమా పరిశ్రమకు చెందిన కొందరు చెబుతున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మళ్లీ హరిహర వీరమల్లు కోసం వర్కౌట్ లు మొదలు పెట్టాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube