రూ.1300లకే బుర్జ్ ఖలీఫా సొంతం చేసుకోండి.. ఎలాగంటారా?

ఏంటి ఆశ్చర్యంగా వుందా? బుర్జ్ ఖలీఫా( Burj Khalifa ) ఏమిటి.రు.1300లకే దొరకడం ఏమిటి అని అలా ఆశ్చర్యపోకండి.మీరు విన్నది నిజమే అయితే నిజమైన బుర్జ్ ఖలీఫా కాదండోయ్.

 Own Burj Khalifa Ice Dish For Just 1300 Rupees Details, Burj Khalifa, Burj Khali-TeluguStop.com

వివరం తెలియాలంటే పూర్తి కధనాన్ని ఒక్కసారి చదవాల్సిందే.సాధారణంగా ఒక ఐస్‌క్రీమ్‌ను ( Ice Cream ) ఎంతమంది తింటారు? ఒకరు, లేదంటే ఇద్దరు కదా.అదే ఫ్యామిలీ ప్యాక్ అయితే తక్కువలో తక్కువ ఐదారుగురు లాగించవచ్చు.కానీ ఏకంగా 16 మంది కూడా కలిసి కూర్చొని తినే ఐస్‌క్రీమ్ ఒకటంటూ ఉంటుందని మీకు తెలుసా? ఐదే బుర్జ్ ఖలీఫా ఐస్ బాల్.

అవును, దుబాయ్‌ ఉన్న బుర్జ్ ఖలీఫా.గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు.అంత ఫేమస్ మరి! ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టవర్ ఇది అని ఎవరిని అడిగినా ఠక్కున చెప్పేస్తారు.ఈ భారీ టవర్ పేరు ఇప్పుడు ఒక ఐస్ బాల్‌కి పెట్టేసారు.

పేరుకి తగ్గట్టే భారీ సైజులో వున్నాయి అక్కడ ఐస్‌క్రీమ్స్.ఈ ఐస్‌క్రీమ్స్ గుజరాత్‌లోని ( Gujarat ) భారుచ్ నగరవాసులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.

భారుచ్‌లో తక్‌దీర్ ఐస్ డిష్ గోలా పేరు ఐస్‌క్రీమ్ షాప్ ఉంది.మజిద్‌భాయ్ భువర్ 31 సంవత్సరాల క్రితం 1992లో దీనిని ప్రారంభించడం జరిగింది.

ఇక గత ఐదేళ్ల నుంచి ఆయన కుమారుడు అయినటువంటి ఫైజల్ భువర్ ఈ షాపును రన్ చేస్తున్నాడు.ఫైజల్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఐస్‌క్రీమ్ వ్యాపారాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు.భారుచ్‌లో మొత్తం ఐదు షాపులను నిర్వహిస్తున్నారు వీరు.తన తండ్రి చేస్తున్న ఐస్‌క్రీమ్ వ్యాపారాన్నే ఈ అన్నదమ్ములు కొనసాగిస్తున్నారు.అలా కృషి, అంకితభావంతో పనిచేస్తూ.తక్‌దీర్ ఐస్‌డిష్ గోలాను ఐదు శాఖలకు విస్తరించారు.ఈ ఐదు దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు తెరిచి ఉంటాయి.ఈ ఐదు షాప్స్‌లో కలిపి మొత్తం 17 మంది ఉద్యోగులు ఉండడం కొసమెరుపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube