ప్రజాసేవ కోసం మా కుటుంబం ముందుంటుంది - ప్యాక్స్ చైర్మన్, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ ఏనుగు తిరుపతిరెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రజాసేవ కోసం తమ కుటుంబం ముందుంటుందని ప్యాక్స్ చైర్మన్, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ ఏనుగు తిరుపతిరెడ్డి అన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం శాత్రాజుపల్లి వార్డులో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఏనుగు తిరుపతిరెడ్డిని ఘనంగా సన్మానించారు.

కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ కావడం సంతోషకరమని రెడ్డి సంఘం సభ్యులు కొనియాడారు.ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజాసేవలో తమ కుటుంబం ముందుంటుందని, ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.

Our Family Is At The Forefront For Public Service Pax Chairman KDCC Bank Directo

గత కొద్ది సంవత్సరాలుగా తమ కుటుంబానికి రైతులతో, ప్రజలతో విడదీయని సంబంధాలు ఉన్నాయన్నారు.సన్మానించిన రెడ్డి సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం సుభాష్ యూత్ సభ్యులు ఏనుగు తిరుపతి రెడ్డి ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
ఇది విన్నారా? మల్టీఫ్లెక్స్‌లలో భారత్, న్యూజిలాండ్ ఫైనల్ లైవ్ స్ట్రీమింగ్

Latest Rajanna Sircilla News