ఆపద సమయంలో ఒకసారి రక్తదాత, ఎల్లప్పుడూ ప్రాణదాత

పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ( District SP Akhil Mahajan ) రాజన్న సిరిసిల్ల జిల్లా :పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా( ఫ్లాగ్ డే) ఈ రోజు సిరిసిల్ల పట్టణ పరిధిలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటి వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరం.

మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిధిగా హాజరై పోలీస్ అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ వారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి అందరితో పాటు రక్తదానం చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి ప్రతి ఒక్కరు రక్తదానం చేసే విధంగా అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో డిఎస్పీ లు, సీఐ లు ,ఎస్ఐలు , సిబ్బంది వారి వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో గత మూడు రోజుల నుండి ప్రతి గ్రామానికి వెళ్లి అక్కడ అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు రక్తదానం చేసే విధంగా అవగాహన నిర్వహించడం జరిగింది.

Once A Blood Donor In Times Of Need, Always A Life Donor , Blood Donor, District

విధి నిర్వహణలో కర్తవ్యమే లక్ష్యంగా ప్రాణత్యాగం చేసి అమరులైన పోలీసులను ఈ సమాజం ఎప్పటికీ మరువదని, వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడుతూ సంఘవిద్రోహ శక్తుల చేతుల్లో బలైన అమర పోలీసులు వీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

సమాజ రక్షణ వీరులు నిరంతర ధీరులు ప్రాణాలను కూడా లెక్కచేయని విధి నిర్వహణ రక్షకులు, ప్రకృతి విలయతాండవం చేస్తే అభయమిచ్చి కాపాడే ఆప్తులు నిద్రించే సమాజానికి నిద్రపోని కాపలాగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.రెగ్యులర్ పోలీసింగ్ తో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది తలసేమియా, సికిల్ సెల్ అనీమియా మరియు డెంగ్యూ వ్యాధిగ్రస్తులకు రక్తం చాలా అవసరం వారికి సహాయం కోసం అమరవిరుల స్మరకర్ధం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 600 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది,జిల్లాలోని యువకులు, బిఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

Advertisement

సిరిసిల్ల,కరీంనగర్,మంచిర్యాల జిల్లాల రెడ్ క్రాస్ సొసైటీ వారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా చక్కగా సహకరించారు అన్నారు.రక్తదాన శిబిరంలో రక్తదానం చేసేందుకు పెద్ద సంఖ్యలో యువకులు ముందుకు వచ్చి త్సాహంగా పాల్గొనడం అభినందించ దగ్గ విషయం అని ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు ఉదయ్ రెడ్డి, నాగేంద్రచారి, రవికుమార్, సి.ఐ లు ఉపేందర్, సధన్ కుమార్, శశిధర్ రెడ్డి, కరుణాకర్, కృష్ణకుమార్,కిరణ్ కుమార్, అనిల్ కుమార్, ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది, బిఎస్ఎఫ్ సిబ్బంది,యువకులు , రాజన్న సిరిసిల్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అద్యక్షులు గుడ్ల రవి ,వరంగల్ అధ్యక్షులు శ్రీనివాస్ ,కరీంనగర్ అధ్యక్షులు కేశవరెడ్డి ,మంచిర్యాల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News