జిల్లాలో అధికారికంగా టీజీ అమలు:కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

సూర్యాపేట జిల్లా:ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై టీఎస్ బదులుగా టీజీ( TG ) అని అధికారంగా అమలు చేయనున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.

వెంకట్రావ్( S Venkatarao )సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏజెన్సీలు,స్వయం ప్రతిపత్తి సంస్థలు,ప్రభుత్వ సంస్థలు,అధికారికపత్రాలు (లెటర్ హెడ్,రిపోర్టు, నోటిఫికేషన్ ఇతరత్రా), ప్రభుత్వ కార్యాలయాలు, వెబ్ సైట్లు,ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇతర అధికారిక సంప్రదింపుల్లో టీజీ అని తక్షణమే అమలు చేస్తామని పేర్కొన్నారు.ప్రభుత్వ కార్యాలయాల ప్రధాన అధికారిక కమ్యూనికేషన్ అంతర్గతంగా,బహిర్గతంగా టీజీ అని ఉపయోగించాలని,టీజీగా నవీకరించి ప్రచురించిన సామగ్రిని వినియోగించాలన్నారు.

Official Implementation Of TG In The District: Collector S. Venkatarao-జిల

Latest Suryapet News