టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహ బంధం గురించి మనందరికీ తెలిసిందే.అయితే వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం బయట ప్రపంచానికి కొద్దిగా మాత్రమే తెలుసు.
హీరోలుగా చూసుకున్నప్పుడు వీరిద్దరూ రెండు విభిన్న ధ్రువాలు కాగా అందులో ఒకటి నందమూరి కుటుంబం కాగా మరొకటి మెగాస్టార్ కుటుంబం. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తప్ప ఇద్దరు స్టార్ హీరోలు ఎప్పుడూ కూడా కలిసి నటించలేదు.
అయినప్పటికీ వీరి మధ్య బలమైన స్నేహం ఎలా కుదిరింది? వీరి మధ్య స్నేహం ఎలా మొదలయింది అన్న ప్రశ్న చాలా మందికి వచ్చింది.
అలా వారి స్నేహ బంధం గురించి దర్శకుడు అనిల్ రావిపూడికీ కూడా మొదట డౌట్ వచ్చింది.
ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా అనిల్ రావిపూడి ఆర్ఆర్ఆర్ టీమ్ ని ఇంటర్వ్యూ చేశాడు.ఈ ఇంటర్వ్యూ లో భాగంగా వారిద్దరి మధ్య స్నేహం ఎప్పుడు ఎలా మొదలైంది అని ప్రశ్నించగా.
ఆ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.మేమిద్దరం భిన్న ధ్రువాలం.
అయితే భిన్న ధ్రువాలు కూడా ఆకర్షించుకుంటాయి అన్నది మా విషయంలో కూడా జరిగింది.అగ్ని పర్వతం బద్దలు అవుతున్నా కూడా ఏమీ తెలియనట్టు గా కామ్ గా ఉంటాడు చరణ్.
అక్కడే చరణ్ అంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది అని తెలిపాడు ఎన్టీఆర్.
అదేవిధంగా స్టార్ క్రికెట్ పోటీలు జరుగుతున్నప్పుడు నేను రాంచరణ్ కలిసి వెళ్లడం మాట్లాడుకోవడం ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఇలాంటివి ఎవరికీ తెలియకుండానే మా ఇద్దరి మధ్య బలమైన స్నేహం ఏర్పడింది అని తెలిపాడు జూనియర్ ఎన్టీఆర్.ఇంకా చెప్పాలి అంటే మా స్నేహం ఎంతలా అంటే మార్చి 26న మా వైఫ్ ప్రణతి బర్త్ డే కాగా చరణ్ బర్త్ డే మార్చి 27.ఇలా మేమిద్దరం కలిసి ఎన్నో పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకున్నాము.కానీ ఈ విషయాలన్నీ చాలా మందికి తెలియదు.
అలాగే మార్చి 26, 12 గంటల సమయంలో చరణ్ ఇంటి దగ్గరికి రావడం కలిసి బయటికి వెళ్లి పోవడం, ఇక మా ఆవిడ ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడగగా, మార్చి 26 అయిపోయింది కదా అని చెప్తాను అంటూ సమాధానం ఇచ్చారు ఎన్టీఆర్. ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో గేట్ దగ్గర ప్రణతి ఉంటుందేమోనని చరణ్ భయపడుతూ ఉంటాడు అంటూ వారి స్నేహ బంధం గురించి చెప్పుకొచ్చాడు తారక్.