నా తల్లి అనుభవించిన నరకం ఏ తల్లికి రాకూడదు... ఎమోషనల్ అయిన జబర్దస్త్ సౌమ్య రావు!

జబర్దస్త్ ( Jabardasth ) యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సౌమ్యరావు ( Sowmya Rao ) ప్రస్తుతం ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.అయితే ఈమె ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించక ముందే పలు తెలుగు సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు.

 No Mother Should Go Through The Hell My Mother Went Through, Jabardast , Soumya-TeluguStop.com

ప్రస్తుతం బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సౌమ్యరావు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.అయితే తాజాగా మదర్స్ డే ( Mothers Day ) సందర్భంగా ఈమె తన తల్లితో కలిసి దిగిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా ఎమోషనల్ పోస్ట్ చేశారు.

సౌమ్యరావు తల్లి క్యాన్సర్( Cancer ) తో బాధపడుతూ మరణించారు.దీంతో ఈమె మదర్స్ డే సందర్భంగా ఎమోషనల్ అయ్యారు.

మదర్స్ డే సందర్భంగా తన తల్లి తన చివరి రోజులలో పడినటువంటి బాధను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.అమ్మంటే అంబులెన్స్, డాక్టర్లు, ట్రీట్మెంట్ మందులు ఇలా నా జీవితంలో అమ్మ అంటే ఒక బాధాకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.అమ్మ కోసం మొక్కని దేవుడు లేదు వెళ్ళని గుడి లేదు.చేయని పూజలు లేవు ఎన్నో ఉపవాసాలు చేశాను ఎంతో మంది దేవుళ్లను ప్రార్థించాను అయినా దేవుడు నామీద దయ చూపించలేదు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

అందరూ మదర్స్ డే రోజు అమ్మ ఫోటోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

నాకు మాత్రం చివరి రోజులలో నా తల్లి పడిన బాధ జ్ఞాపకంగా వస్తుంది.రాత్రి పగలు నీకు ఎంత సేవ చేసినా ఎన్నో పూజలు చేసిన అవన్నీ కూడా వృధా అయ్యాయి.అమ్మ నువ్వు లేని నా జీవితం ఎప్పటికీ అసంపూర్ణం ప్రతిరోజు ప్రతిక్షణం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను.

అమ్మ నువ్వు నాకోసం మళ్లీ పుడతావని ఎదురుచూస్తున్నాను.దేవుడా ప్లీజ్ మా అమ్మ నాన్నలను తిరిగి నాకు ఇవ్వు ఐ మిస్ యు అమ్మ… హ్యాపీ మదర్స్ డే…మిస్ యూ సో మచ్ అంటూ ఈ సందర్భంగా సౌమ్య రావు తన తల్లి పడిన బాధను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఇలాంటి బాధ మరే తల్లికి రాకూడదని చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube