రాత్రి దొంగలు అరెస్ట్: ఎస్పీ రాజేంద్రప్రసాద్

సూర్యాపేట జిల్లా:రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లలో లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న కరుడుగట్టిన దొంగలను సూర్యాపేట పట్టణ పోలీసులు పట్టుకున్నారని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ( SP Rajendra Prasad ) అన్నారు.

బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ ఆఫిస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.

మేడిపల్లికి చెందిన రఘు,మరియు తిరుపతికి చెందిన గణేష్ 2022లో చర్లపల్లి జైల్లో పరిచయం ఏర్పడిందని, అప్పటి నుండి ఇద్దరు కలిసి రాత్రి వేళల్లో ఇళ్లల్లో చోరీలు చేయడం ప్రారంభించారన్నారు.తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకొని చోరీలు చేయడంలో వీరు అరితేరారని,A-1 పై ఉప్పల్,మేడిపల్లి, కరీంనగర్,హుజురాబాద్, పోలీస్ స్టేషన్లో 32 కేసులు ఉండగా,A-2 పై కడప, ఎల్బీనగర్,మేడిపల్లి, ఉప్పల్ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో మొత్తం 30 కేసులు ఉన్నట్లు చెప్పారు.

Night Thieves Arrested: SP Rajendra Prasad , SP Rajendra Prasad, Night Thieves,

ఈ నేపథ్యంలో బుధవారం సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద ఉదయం 5 గంటల సమయంలో పట్టణ సీఐ రాజశేఖర్, ఎస్ఐలు సతీష్ వర్మ, యాకుబ్ వాహనాలు తనిఖీ( Yakub vehicles ) చేస్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు సిబిజెడ్ ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా కనిపించగా పోలీసులు ఆపడానికి ప్రయత్నింగా పారిపోతున్న క్రమంలో పోలీసులు వెంబడించి పట్టుకొని తనిఖీ చేశారన్నారు.వారి వద్ద బంగారు అభరణాలు లభ్యం కావడంతో ఎక్కడవని పట్టణ సిఐ రాజశేఖర్ ప్రశ్నించగా వారు మేడిపల్లి,సూర్యాపేట,తొర్రూరు, కోదాడలో రాత్రి వేళల్లో ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నాట్లు ఎస్పీ తెలిపారు.

ఈ మేరకు నిందితుల వద్ద నుండి 16 తులాల బంగారం,880 గ్రాముల వెండి ఆభరణాలు,రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని,అరెస్టు చేసి నిందితులను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు పది లక్షల వరకు ఉంటుందన్నారు.

Advertisement

దొంగలను చాకచక్యాంగా పట్టుకున్న సిఐ రాజశేఖర్, ఎస్ఐలను,సిబ్బందిని అభినందించి రివార్డులు అందజేశారు.ప్రజలు రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఇంటి పన్ను కట్టని ఇంటి ముందు మున్సిపల్ సిబ్బంది ధర్నా
Advertisement

Latest Suryapet News