మహాత్మా గాంధీ యూనివర్శిటీలో కొత్త కోర్సులు:ఉపకులపతి ఆచార్య చోల్లేటి గోపాల్ రెడ్డి...!

నల్లగొండ జిల్లా:విశ్వ విద్యాలయాల సర్వతో ముఖాభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయ( Mahatma Gandhi University ) ఉపకులపతి ఆచార్య చోల్లేటి గోపాల్ రెడ్డి( Cholleti Gopal Reddy ) అన్నారు.

జిల్లా కేంద్రంలోని యూనివర్శిటీ హాల్ లో తన అధ్యక్షతన జరిగిన 7వ అకాడమిక్ సెనేట్ సమావేశంలో పలు అంశాలను ఏజెండాలో పొందుపరిచి ఆమోదం కోసం సభ్యుల ముందు ఉంచారు.

కరోనా కారణంగా పరీక్ష విధానంలో వచ్చిన మార్పులు సవరిస్తూ తిరిగి పూర్వ విధానం కొనసగిస్తామన్నారు.వచ్చే విద్యా సంవత్సరంలో సైకాలజీ మరియు అదనపు ఇంజనీరింగ్ సిఎస్పీ కార్యక్రమం, డిప్లమా ఇన్ యోగ ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు.

రాబోయే విద్యా సంవత్సరం నుంచి (30:70) 30% ఇంటర్నల్,70% ఎగస్ట్రనల్ మూల్యంకన విధానాన్ని ప్రవేశ పెట్టనున్నామన్నారు.సిజిసిఏ గ్రేడింగ్ విధానం లో మెమోలు అందించనున్నట్లు,యుజిసి విధానాల అనుగుణంగా పిహెచ్ డి విధానం అమలు జరుపుతున్నట్లు తెలియజేశారు.ఈ విద్యా సంవత్సరానికి రూ.108 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.అర్హత కలిగిన డిగ్రీ కళాశాల అధ్యాపకులకు సూపర్వైజ్ అవకాశాలు,గైడ్ యొక్క మార్పు,ప్లేగరిజం పరిశోధన కాలంలో సమర్పించవలసిన పత్రాలు తదితర అంశాలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో రిజిస్టర్ ఆచార్య తుమ్మ కృష్ణారావు,పూర్వ ఉపకులపతి ఆచార్య గంగాధర్,ఓఎస్డి ఆచార్య ఆల్వాల రవి,పాలక మండలి సభ్యులు బోయినపల్లి కృష్ణారెడ్డి, శ్రీదేవి,ఆకుల రవి,ఘన శ్యామ్,కోటేశ్వరరావు, సత్యనారాయణ,వివిధ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాల్స్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
భర్తను చంపిన భార్య... 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు...!

Latest Suryapet News