విచ్చలవిడిగా నాటుసారా కేంద్రాలు...!

సూర్యాపేట జిల్లా: మోతె మండల పరిధిలోని పలు గ్రామాల్లో,తండాల్లో గుడుంబా వాసన గుప్పుమంటుంది.

నాటు సారా తయారీకి కావలసిన నల్ల బెల్లం మొత్తం తండాల నుండి సరఫరా అవుతున్నట్లు,దీనికి పలు శాఖల అధికారులు గుట్టుగా సహకరిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎక్సైజ్ అధికారులు గుడుంబా అమ్మకంపై అడపాదడపా దాడులు చేస్తున్నా కట్టడి చేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.మద్యం ధరలు విపరీతంగా పెరగడం, నాటుసారా అమ్మకాలు జోరుగా సాగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు సారాకు బానిసై ఆర్ధికంగా, ఆరోగ్య పరంగా రోజురోజుకు చితికిపోతున్నారని బాధిత కుటుంబాల మహిళలు వాపోతున్నారు.

గుడుంబా తయారీ,అమ్మకం మూలాలపై ఎక్సైజ్ శాఖ సీరియస్ గా దృష్టి పెట్టక పోవడంతోనే యధేచ్చగా గుడుంబా ఏరులై పారుతోందని అంటున్నారు.మోతె మండలంలో గుడుంబా విక్రయాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టి పెట్టడం లేదని మండల ప్రజలు బహిరంగంగానే మండిపడుతున్నారు.

అప్పుడప్పుడు దాడులు చేస్తున్న వాటి మూలాలను విస్మరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.గుడుంబా కేంద్రాలను సమూలంగా నిర్మూలిస్తేనే పేద, మధ్యతరగతి కుటుంబాలు బయట పడతాయని,ఇప్పటికైనా గుడుంబాపై సంబంధిత అధికారులు ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు.

Advertisement
రైతు భరోసా పథకంపై ప్రజాభిప్రాయ సేకరణ

Latest Suryapet News