తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ ( Nara Lokesh )యువగళం పాదయాత్ర ఆగిపోయిన సంగతి తెలిసిందే.చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో సెప్టెంబర్ తొమ్మిదవ తారీకు పాదయాత్ర ఆపేయటం జరిగింది.
అప్పటినుండి చంద్రబాబు కేసు విషయంలో బెయిల్ కోసం లోకేష్ న్యాయపోరాటం చేస్తూ ఉన్నారు.ఈ క్రమంలో లోకేష్ ఢిల్లీ వెళ్లడం జరిగింది.
అక్కడ సుప్రీంకోర్టు కి చెందిన పెద్ద పెద్ద లాయర్లతో మంతనాలు జరుపుతున్నారు.పరిస్థితి ఇలా ఉండగా మొన్న సెప్టెంబర్ 29వ తారీకు నుండి పాదయాత్ర మళ్లీ మొదలు కాబోతున్నట్లు స్వయంగా లోకేష్ ప్రకటన చేయడం జరిగింది.
కానీ తాజాగా మరోసారి పాదయాత్ర వాయిదా వేసినట్లు తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) జాతీయ కార్యాలయం నుండి ప్రకటన ఏపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు( Atchannaidu ) విడుదల చేయడం జరిగింది.
చంద్రబాబు అక్రమ అరెస్టు, పార్టీ శ్రేణులపై దాడులు ఇంకా అక్రమ కేసులు వేధింపుల నేపథ్యంలో యువగళం పాదయాత్ర పునఃప్రారంభ తేదీని వాయిదా వేసుకుని న్యాయవాదులతో సంప్రదిస్తూ న్యాయపోరాటం చేయాలని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh )పార్టీ ముఖ్య నేతలను కోరడం జరిగింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక్క ఆధారం చూపలేని ప్రభుత్వం మరోపక్క ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ అక్రమాలంటూ అసత్య ఆరోపణలతో బురద జల్లుతున్నారు.ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అక్రమంగా లోకేష్ గారి పేరు చేర్చడంతో పాటు చంద్రబాబు గారిపై కూడా పీటీ వారింట్లు జారీ చేస్తున్నారు.
వీటన్నిటిని న్యాయపరంగా ఎదుర్కోవాల్సిన నేపథ్యంలో యువగళం పాదయాత్రను కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని… పునఃప్రారంభ తేదీని త్వరలో ప్రకటించాలని ముఖ్య నేతల సమావేశంలో నిర్ణయించినట్లు.స్పష్టం చేస్తూ అచ్చెన్నాయుడు ( Atchannaidu )ప్రకటన విడుదల చేశారు.