నందికొండ మున్సిపల్ పీఠం దక్కించుకున్న హస్తం పార్టీ

నల్లగొండ జిల్లా:నందికొండ మున్సిపాలిటీ చైర్ పర్సన్ కర్ణ బీ అనూష రెడ్డి,వైస్ చైర్మన్ మంద రఘువీర్ (బిన్నీ) పైఆర్‌ఎస్‌( BRS ) చీలిక వర్గం, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మాన సమావేశానికి మొత్తం 9 మంది సభ్యులు ఉదయం 10:30కు కౌన్సిల్‌ సమావేశ మందిరానికి చేరుకున్నారు.

కోరమ్ సరిపడా ఉండడంతో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఆర్డీవో చెన్నయ్య ఫొటో, వీడియో చిత్రీకరణ ద్వారా 9 మంది కౌన్సిలర్ల సంతకాలు సేకరించారు.

అనంతరం 9వ వార్డు కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ అవిశ్వాసం ప్రతిపాదించగా మిగతా ఎనిమిది మంది సభ్యులు ఆమోదించారు.నందికొండ మున్సిపాలిటీలోని 11 మంది సభ్యులు ఉండగా ఈర్ల రామకృష్ణ, తిరుమలకొండ అన్నపూర్ణ, మంగత నాయక్, జి.రమేష్,రమావత్ శిరీష, ఆదాసు నాగరాణి,నిమ్మల ఇందిరా,నంద్యాల శ్వేతారెడ్డి 9 మంది అవిశ్వాసానికి అనుకూలంగా చేతులు లేవడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ఎన్నికల అధికారి ధ్రువీకరించారు.దీనితోచైర్‌పర్సన్‌,వైస్ చైర్మన్ కు పదవీ గండం తప్పలేదు.

Nandikonda Municipal Seat Won By Congress Party ,Nandikonda Municipality, Brs ,

మున్సిపల్‌ పీఠం కోల్పోవడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నిరాశ నెలకొనగా, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయగర్వంతో కనిపించారు.ఈనేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తదుపరి కొత్త చైర్‌ పర్సన్‌గా హస్తం పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్( Female counsellor) ఎన్నికయ్యే అవకాశం ఉంది.నూతన చైర్మన్‌,వైస్‌ చైర్మన్ల ఎన్నిక లాంఛనమేననితేలిపోయింది.

Advertisement

నందికొండ మున్సిపాలిటీలో చైర్మన్‌,వైస్‌ చైర్మన్‌ల రాజీనామాలను రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన శాఖ ఆమోదించిన అనంతరం నూతన చైర్మన్‌,వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ విడుదల కానుంది.ఇందుకు దాదాపు వారం,పది రోజులు సమయం పట్టే అవకాశాలున్నాయి.

నోటిఫికేషన్‌ వెలువడగానే చైర్మన్‌,వైస్‌ చైర్మన్ల ఎన్నిక జరుగనుంది.ఇదిలా ఉంటేకొత్త చైర్మన్ పై ఉత్కంఠ నెలకొంది.

నందికొండ మున్సిపాలిటీ చైర్ పర్సన్,వైస్ చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది.చైర్మన్ పీఠం మహిళలకు రిజర్వర్డు కావడంతో మూడో వార్డు కౌన్సిలర్ శిరీష,8వవార్డు కౌన్సిలర్ తిరుమలకొండ అన్నపూర్ణ, ఏడవ వార్డు కౌన్సిలర్ నిమ్మల ఇందిరా,ఆరో వార్డు కౌన్సిలర్ ఆదాసు నాగరాణి మధ్య తీవ్ర పోటీ నెలకొందని అంటున్నారు.

చైర్మన్ గిరి ఎవరిని వరించనుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

కులం పేరుతో దూషించిన ముగ్గురికి ఆరు నెలలు జైలు శిక్ష
Advertisement

Latest Nalgonda News