బంగార్రాజులు మీ ఇంటికి వచ్చేశారు.. చూశారా?

అక్కినేని హీరోలు నాగార్జున మరియు నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Nagarjuna And Naga Chaitanya Bangarraju Movie Ott Zee5 Streaming , Bangarraju, F-TeluguStop.com

ఇటీవలే ఈ సినిమాను జీ5 ఓటీటీ వారు దక్కించుకున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.నేటి నుంచి జీ5 లో బంగార్రాజు స్ట్రీమింగ్‌ అవుతుంది.

అక్కినేని అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి గా ఉన్నారు.కరోనా కారణంగా థియేటర్లలో ఈ సినిమాను చూడలేక పోయినా ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లో కూర్చొని బంగార్రాజు ను చూడాలా అని ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో జీ5 పెద్ద మొత్తానికి ఈ సినిమా ను కొనుగోలు చేయడం జరిగింది.నేటి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న నేపధ్యంలో ప్రేక్షకులు పెద్దఎత్తున వీక్షించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు వచ్చిన విషయం తెలిసిందే.సోగ్గాడే సినిమా వచ్చిన ఐదు సంవత్సరాల తర్వాత బంగార్రాజు వచ్చింది.అయినా కూడా ఈ సినిమాను ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు.బంగార్రాజు సినిమా దాదాపు యాభై కోట్ల వసూళ్లను దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇక ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించగా.నాగచైతన్య కు జోడిగా ఉప్పెన హీరోయిన్ గా కృతి శెట్టి నటించిన విషయం తెలిసిందే.

నాగచైతన్య మరియు కృతి శెట్టి జోడీ కు మంచి రెస్పాన్స్ దక్కింది.సినిమా లోని కామెడీ మరియు ఎమోషనల్ సన్నివేశాలు అన్నీ కూడా సినిమా స్థాయిని పెంచే విధంగా ఉన్నాయి.

కనుక ఫ్యామిలీ ఆడియన్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా భారీ ఎత్తున చూసే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube