ఊహలు గుసగుసలాడే సినిమా తో తెలుగు తెర కి పరిచే అయిన నాగ శౌర్య ఆ సినిమా తినే మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ అందులో కొన్ని మాత్రమే విజయం సాధించాయి…పవన్ బాసంశెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా మారాడు.
‘దసరా’ వంటి సూపర్ హిట్ ను అందించిన ‘ఎస్ఎల్వి సినిమాస్’ సంస్థ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.యుక్తి తరేజ హీరోయిన్ గా నటించింది.
టీజర్, ట్రైలర్ బాగున్నాయి.‘ఛలో’ తర్వాత నాగ శౌర్య( Naga Shaurya ).అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ చేసాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యేలా చేశాయి.అయితే జూలై 7న రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది…
ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ డిజప్పాయింట్ చేసిందంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు.
ఈ క్రమంలో ఓపెనింగ్స్ కూడా సో సో గానే నమోదయ్యాయి.వీకెండ్ తర్వాత ఈ మూవీ చాలా వరకు స్లో అయిపోయింది.ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం 1.05 cr , సీడెడ్ 0.30 cr , ఉత్తరాంధ్ర 0.40 cr , ఈస్ట్ 0.27 cr , వెస్ట్ 0.18 cr , గుంటూరు 0.22 cr ,కృష్ణా 0.25 cr, నెల్లూరు 0.13 cr , ఏపీ + తెలంగాణ (టోటల్) 2.80 cr , రెస్ట్ ఆఫ్ ఇండియా 0.26 cr , ఓవర్సీస్ 0.31 cr, వరల్డ్ వైడ్ (టోటల్) 3.37 cr (షేర్).
‘రంగబలి’ (Rangabali) చిత్రానికి రూ.4.67 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల షేర్ ను రాబట్టాలి.మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.3.37 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది.ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ.1.63 కోట్ల షేర్ ను రాబట్టాలి.అది కష్టంగానే కనిపిస్తుంది…ఈమధ్య నాగశౌర్య సినిమాలు ఏది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయాలను అయితే అందుకోవడం లేదు.ఆయన యాక్టింగ్ పరం గా బాగా చేసినప్పటికీ సినిమా స్టోరీలు పరంగా చాలా వీక్ గా ఉంటున్నాయి…