మూసికి తగ్గిన వరద..గేట్లు మూసివేత

నల్గొండ జిల్లా: కేతేపల్లి మండల పరిధిలోని మూసి ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు తగ్గుముఖం పట్టడంతో సోమవారం ప్రాజెక్టు అధికారులు గేట్లు బంద్ చేసి దిగువకు నీటి విడుదల పూర్తిగా నిలిపివేశారు.హైదరాబాదు నగరంతో పాటు మూసి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ముసి ప్రాజెక్టుకు సోమవారం కేవలం 994 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది.

645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసి ప్రాజెక్టులో సాయంత్రం వరకు నీటిమట్టం 644.50 ఉందని ప్రాజెక్టు అధికారి ఉదయ్ తెలియజేశారు.

Musi Project Flood Has Receded The Gates Have Been Closed, Musi Project, Flood ,

Latest Nalgonda News