పోలీసు అధికారుల నెలవారి సమీక్ష సమావేశం

సూర్యాపేట జిల్లా:జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ రాజేంద్రప్రసాద్ శుక్రవారం పోలీసు అధికారుల నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశం నందు జిల్లాలో కేసుల నమోదు,కేసుల స్థితిగతులు,నేరాల నివారణ చర్యలు,నేరాల అదుపు,రోడ్డు భద్రత చర్యలు,గణేష్ నవరాత్రి ఉత్సవాల బందోబస్తు ఏర్పాటు,సీసీ కెమెరాల ఏర్పాటు,కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు,పోలీస్ ఫంక్షనల్ వర్టికల్ విభాగాల నిర్వహణ మొదలగు అంశాలపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు.

కేసులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, ఫిర్యాదుదారులకు పూర్తి భరోసా కల్పించే విధంగా ఉత్తమమైన పోలీస్ సేవలను అందించాలని,సామాజిక అంశాలపై ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించి నేరాల నివారణకు ప్రజలను చైతన్యవంతం చేయాలని ప్రజలను భాగస్వామ్యం చేయాలని అధికారులను సిబ్బందిని ఆదేశించారు.గణేష్ నవరాత్రి ఉత్సవాలకు జిల్లాలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని,అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ఈనెల 31 నుండి జరుపుకోనున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు,భక్తులు,ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కలిసి గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.మండపాల ఏర్పాటు విషయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అన్నారు.

మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలని అన్నారు, మండపాల ఏర్పాటు విషయంలో సంబంధిత అధికారుల అనుమతులు పొందాలని కోరారు.అనంతరం పోలీస్ ఫంక్షనల్ వర్టికల్ రివార్డు మేళాలో భాగంగా జిల్లాలో అమలవుతున్న పోలీసు ఫంక్షనల్ వర్టికల్ నిర్వహణను సిబ్బంది అందరూ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అభినందించారు.

Advertisement

రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు జిల్లాలో అమలవుతున్న పోలీసు పని విభాగాలు ఫంక్షనల్ వర్టికల్ పని విభాగాల్లో సామర్థ్యం చూపి బాగా పనిచేసిన సిబ్బందికి రివార్డ్స్ అందించారు.ప్రతిభ చూపే ప్రతి ఒక్క సిబ్బందినీ ప్రోత్సహిస్తామని,రివార్డ్స్ అందజేస్తామని అన్నారు.

ఈ సమావేశంలో డిఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వర్ రెడ్డి,రవి,స్పెషల్ బ్రాంచ్ డిసిఆర్బి ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్,నర్సింహ,సిఐలు రాజేష్, నాగార్జున,రాజశేఖర్,ఆంజనేయులు,రామలింగారెడ్డి, శివశంకర్,పి.ఎన్.డి ప్రసాద్,ఎస్సైలు,ఐటీ కోర్, డీసీఆర్బీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News