ఉత్సవాల పేరుతో వేల కోట్లు దుర్వినియోగం...!

సూర్యాపేట జిల్లా: ఉత్సవాల పేరుతో వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని,తెలంగాణ రాష్ట్ర శతాబ్ది ఉత్సవాల పేరు మీద పేపర్ టీవీ ప్రకటనలకు ప్రజాధనం వేలకోట రూపాయలు దోపిడికి గురవుతుందని మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వేపూరి సుధీర్ విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుక్రవారం ఆయన మండల కేంద్రంలో మాట్లాడుతూ ఉద్యమకారులను అణచివేశారని,ప్రత్యేక రాష్ట్రం వస్తే నీళ్లు,నిధులు, నియామకాలు,స్వేచ్ఛ స్వయం పాలన వస్తుందని నిరుద్యోగ యువకులు ప్రాణ త్యాగాలు చేశారని తెలిపారు.

కానీ,ఈ తొమ్మిదేళ్లలో ఉద్యమకారులకు నిరుద్యోగులకు నాలుగున్నర కోట్ల ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు.ఉద్యోగ,ఉపాధి లేక యువకులు,రుణమాఫీ గాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని,లక్షల కోట్ల రూపాయలు ప్రజాదనాన్ని దోచుకుంటూ వందల ఎకరాలు ఆక్రమణలు జరుగాయని, స్యాండ్,ల్యాండ్,వైన్స్ మాఫియాలో కమిషన్లు తీసుకుంటున్న కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు సరైన రీతిలో గుణపాఠం చెప్పి తరిమికొడతారన్నారు.

Misappropriation Of Thousands Of Crores In The Name Of Festivals, Suryapet, Cong

తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో రాష్ట్రంలో గెలిపించాలన్నారు.

Advertisement

Latest Suryapet News