నల్లి తెగుళ్ళతో మిర్చి రైతుకు కన్నీళ్లు...!

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని పలు గ్రామాల్లో మిరప సాగు చేసిన రైతులు మిరప పంటకు పూత బాగా కాసి,పిందె దిగిందని సంతోష పడిన రైతులకు మాయదారి తెగుళ్లు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి నల్లి తెగులు పురుగు నట్టెట్లో మంచిదని అన్నదాతలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

లక్షలు పెట్టుబడి పెట్టి మిరప సాగు చేస్తే ఈ సారి కాలం కలిసిరాలేదని, వాతావరణ పరిస్థితులు అనుకూలించక నల్లి పురుగు సోకి పెట్టిన పెట్టుబడుల కూడా వచ్చే అవకాశం లేదని అయోమయంలో పడ్డారు.

అసలే పంట నష్టపోయి ఉంటే ప్రస్తుతం ఉన్న మిర్చి ధర ఏమాత్రం గిట్టుబాటు కాదని,దీనితో మిర్చి రైతులకు అప్పుల ఘాటు తప్పేలా లేదని వాపోతున్నారు.మిర్చి గింజ నాటిన నాటి నుండే నిత్య పరిశీలన చేస్తూ మందులు కొట్టినా పూర్తి స్థాయిలో పురుగును అరికట్టడం లేదని,ప్రస్తుతం రైతును ఎండు తెగుళ్లు, ఎర్ర తెగుళ్లు,నల్లి పురుగు, ఫంగస్, బ్యాక్టీరియా వేరుకుళ్ళు తెగుళ్లు వెంటాడుతున్నాయని అంటున్నారు.

మిర్చి తోటతో లాభాలు పొందవచ్చని ఆశించిన తమకు నిరాశే ఎదురైందని,దీనితో చేసిన అప్పులు తీరే మార్గం కనిపించడం లేదని అంటున్నారు.మోతె మండల వ్యాప్తంగా సుమారు 1200 ఎకరాల్లో దాదాపు 300 మంది రైతులు ఈ సారి మిర్చి సాగు చేశారని తెలుస్తోంది.

ఈ సారి కాత బాగా వస్తుందనుకుంటే తెగుళ్లు వల్ల నష్టాలు మిగిలాయని, దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Advertisement
అకాల వర్షాలతో అపార నష్టం...రైతులను ఆదుకోవాలి : బీఆర్ఎస్

Latest Suryapet News