15 న నల్లగొండకు మంత్రి కేటీఆర్...!

నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలో రూ.1,164 కోట్లతో సుందరీకరణ, అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు రాష్ట్ర పురపాలక,ఐటి పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్‌ రెడ్డి( Minister Jagdish Reddy ) ఈ నెల 15 న నల్లగొండకు రానున్నట్లు తెలుస్తోంది.

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్ రెడ్డిని గెలిపిస్తే నల్లగొండను దత్తత తీసుకొని రూపురేఖలు మారుస్తానన్న సీఎం కేసీఆర్ ఎన్నికల హామీల అమలులో భాగంగా జిల్లా కేంద్రమైన నల్గొండ మున్సిపాలిటీ పట్టణ అభివృద్ధికి వందల కోట్ల నిధులు మంజూరు చేయగా చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ ఈనెల 15న నల్గొండకు రాబోతున్నట్లు బీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఇప్పటికే రూ.1,164 కోట్లతో నల్గొండ పట్టణంలో సుందరీకరణ,అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.తానిచ్చిన హామీల అమలు సక్రమంగా సాగేందుకు సీఎం కేసీఆర్( CM KCR ) సిద్దిపేట కమిషనర్ రమణాచారికి అదనంగా నల్గొండ మున్సిపాలిటీ కమిషనర్ బాధ్యతలు అప్పగించి పనులు వేగంగా జరిగేలా తరచూ పర్యవేక్షణ చేస్తుండడం విశేషం.

ఇప్పటికే పూర్తయిన కొన్ని పనులను గతంలో జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిలు ప్రారంభించారు.తాజాగా మరో రూ.123.52 కోట్ల పనులు పూర్తికావడంతో వాటి ప్రారంభోత్సవంతో పాటు కొత్తగా మంజూరైన రూ.590 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించారు.మంత్రి పర్యటన సందర్భంగా మరో 102.74 కోట్ల పనుల మంజూరుకు ప్రతిపాదనలను సమర్పించనున్నట్లు సమాచారం.

కార్పొరేట్ హెయిర్ సెలూన్స్ అడ్డుకోండి

Latest Suryapet News