హోంగార్డు నవకిషోర్ కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి ఆర్థిక సహాయం

నల్లగొండ జిల్లా:నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్( Narcut Pally Police Station ) లో హోంగార్డుగా పనిచేస్తున్న మేరుగు నవకిశోర్( Merugu Navakishore ) మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ వద్ద జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ సందర్భంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే.

ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komati Reddy Venkata Reddy ) స్పందించారు.

అతని మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.బుధవారం అన్నేపర్తిలోని మేరుగు నవకిషోర్ పార్దివదేహాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్ప,నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్( Abbagoni Ramesh ),నల్గొండ జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంపిన రూ.2 లక్షల నగదును వారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆంగోతు ప్రదీప్ నాయక్, చిన్నాల జానయ్య తదితరులు పాల్గొన్నారు.

Minister Komatireddy Financial Assistance To Home Guard Navakishore Family , N
మూసికి పూడిక ముప్పు

Latest Nalgonda News