ఎన్నారై ఐశ్వర్య రెడ్డి మరణం పట్ల మంత్రి జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి

సూర్యాపేట జిల్లా:అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఐశ్వర్య రెడ్డి( Aishwarya Reddy ) మృతి చెందిన ఘటనపై మంత్రి జగదీష్ రెడ్డి( Minister Jagdish Reddy ) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

విషయం తెలిసిన మరుక్షణం నుండి కుటుంబ సభ్యులతో టచ్ లో వున్న మంత్రి,ఈ ఘటనను వెంటనే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఐశ్వర్య రెడ్డి ఆచూకీ కోసం అమెరికా తెలుగు అసోసియేషన్( American Telugu Association ) తో సంప్రదింపులు జరిపారు.

ఐశ్వర్య రెడ్డి పార్థివ దేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు మంత్రి కేటీఆర్ తో ఎప్పటికపుడు సంప్రదింపులు జరుపుతున్నారు.ఐశ్వర్య కుటుంబానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు.

Minister Jagadish Reddy Is Shocked By The Death Of NRI Aishwarya Reddy-ఎన్

అలాగే తెలంగాణ ప్రభుత్వం తరుపున అమెరికాలోని భారత కాన్సులెట్ అధికారులతో మాట్లాడిన ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్,తెలంగాణ ఎన్నారై శాఖ అధికారులు.విదేశీ పర్యటనలో ఉంటూనే ఎప్పటికప్పుడు ఐశ్వర్య రెడ్డి పార్థివ దేహాన్ని ఇండియాకు తరలించే ఏర్పాట్లపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష చేస్తున్నారు.

Advertisement

Latest Suryapet News