అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్.!

తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ బాధ్యతలు కరించనున్నారు.ఈ మేరకు రేపు ఉదయం 8.30 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు.

 Mim Mla Akbaruddin As Assembly Protem Speaker!-TeluguStop.com

రేపు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ తో ప్రమాణం చేయించనున్నారు.

అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో అసెంబ్లీ తొలి సమావేశాల్లో ప్రొటెం స్పీకర్ గా ఎవరు ఉంటారనేది చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో మొదటగా ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్ ను ఎన్నుకునే వరకు ప్రొటెం స్పీకర్ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే.

మామూలుగా ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా వారిని ప్రొటెం స్పీకర్ గా నియమిస్తారు.కాగా అక్బరుద్దీన్ ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube