రైతులకు నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలి:ఎమ్మెల్యే

రైతులకు నీటి ఎద్దడి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.

సోమవారం మోతె మండల పరిషత్ కార్యాలయంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోతె మండలంలో ఆయకట్టు కింద ప్రతి ఎకరాకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఆయకట్టులో ఏ గ్రామాలకు నీరు అందడం లేదో పరిశీలించి,నీరు అందేవిధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అధికారులు సమన్వయంతో పని చేసి,రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.

రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు.చీఫ్ ఇంజనీర్ తో ఫోన్లో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు.

అనంతరం ఆయా గ్రామాలకు సంబంధించిన కళ్యాణ్ లక్ష్మి చెక్కులను లబ్దారులకు పంపిణీ చేశారు.ఈ సమావేశంలో ఎస్సారెస్పీ అధికారులు రమేష్,ఏఈ లింగయ్య, ఎమ్మార్వో యాదగిరి, ఎంపీడీవో చారి,టిఆర్ఎస్ నాయకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten

Latest Suryapet News