నేరేడుచర్లలో 42.0 డిగ్రీల గరిష్ట స్థాయి ఉష్ణోగ్రత

నేరేడుచర్ల పట్టణం( Nereducherla )లో మంగళవారం 42.0 డిగ్రీల గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు( Temperatures ) నమోదయ్యాయి.

ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు మండుతున్నాయి.

ఉదయం నుండే ఎండలు తీవ్ర స్థాయిలో నమోదవుతూ భానుడు భగభగలతో మధ్యాహ్న సమయంలో నిప్పుల వర్షం కురిపించాడు.దంచికొడుతున్న ఎండలను చూసి ప్రజలు బయటికి వెళ్లాలంటే భయాందోళనలకు గురవుతున్నారు.

రోడ్లన్నీ ఎటు చూసినా నిర్మానుస్యంగా మారాయి.ముఖ్యంగా చిన్నపిల్లలు,వృద్ధులు ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నారు.

దీంతో ఈ వారం రోజులు ప్రజలు ఎక్కువ శాతం బయటికి రాకుండా ఉంటేనే మంచిదని పలువురు సూచిస్తున్నారు.

Advertisement

Latest Suryapet News