మఠంపల్లి ఎస్ఐకి హైకోర్ట్ రూ.5 వేల జరిమానా...!

సూర్యాపేట జిల్లా: మఠంపల్లి రెవిన్యూ శివారు( Matampalli )లోని 472 సర్వేనెంబర్ భూమి వివాదంలో మఠంపల్లి ఎస్ఐ బాలకృష్ణకి రూ.5వేలు జరిమానా విధిస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివీ భాస్కర్ రెడ్డి తీర్పు చెప్పినట్లు బాధితుడు తరపు న్యాయవాది జి.

కరుణాకర్ రెడ్డి( Karunakar Reddy ) సోమవారం తెలిపారు.

మఠంపల్లి రెవెన్యూ శివారులోని సర్వేనెంబర్ 472లో ఉన్న తమ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వల్లపుదాసు కళమ్మ హుజూర్ నగర్( Huzur Nagar ) సీనియర్ సివిల్ కోర్టును ఆశ్రయించగా,పరిశీలించిన కోర్టు మఠంపల్లి ఎస్ఐకి ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాల ప్రకారం పని చేయాల్సిన ఎస్ఐ నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితురాలు కళమ్మ హైకోర్టును ఆశ్రయించింది.

డబ్ల్యూయుపి 18124/ 2023 పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు వాదనలు వినిపించారు.వాదనలు విన్న న్యాయమూర్తి కోర్టు ఆదేశాలను లెక్క చేయని ఎస్ఐకి నాలుగు వారాలు టైం ఇస్తూ జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.దీంతో సోమవారం ఎస్సై బాలకృష్ణ( SI Balakrishna ) రూ.5000 జరిమానా చెల్లించి రసీదు తీసుకున్నట్లు పిటిషనర్ తరపు న్యాయవాది కరుణాకర్ రెడ్డి తెలిపారు.

Advertisement

Latest Suryapet News