జాతి సమైక్యతా ర్యాలీకి భారీ బందోబస్తు:ఎస్పీ

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించే జాతి సమైక్యతా భారీ ర్యాలీకి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా రాజేంద్రప్రసాద్ తెలిపారు.

గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ర్యాలీ ముగిసే పీఎస్ఆర్ సెంటర్ వద్ద ఏర్పాట్లను ఎస్పీ పర్యవేక్షించారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ శుక్రవారం ఎస్వి ఇంజనీరింగ్ కళాశాల నుండి ప్రారంభమై కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా,శంకర్ విలాస్ సెంటర్ మీదుగా పీఎస్ఆర్ సెంటర్ వరకు ర్యాలీ ఉంటుందని అన్నారు.ర్యాలీ కోసం పోలీసు బందోబస్తు,ట్రాఫిక్ మల్లింపులకు సంబంధించి,ర్యాలీకి వచ్చే ప్రజలకు మార్గమధ్యలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం గురించి,విధుల నిర్వహణపై సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఎస్పీ సిబ్బందికి సలహాలు సూచనలతో దిశానిర్దేశం చేశారు.

Massive Preparations For Ethnic Unity Rally: SP-జాతి సమైక్య�

ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడొద్దని,ర్యాలీకి వచ్చే విద్యార్థులను జాగ్రత్తగా తరలించాలని సిబ్బందిని ఆదేశించారు.అన్ని మార్గాలలో ట్రాఫిక్ నియంత్రించాలని వాహనదారులు,షాప్స్ యజమానులు రోడ్లపై వాహనాలు నిలపకుండా చూసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట డిఎస్పీ నాగభూషణం,సిఐలు శ్రీనివాస్,రాజశేఖర్,ఎస్ఐలు,సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
కూరగాయల కొనుగోలులో సామాన్యుడికి తప్పని తిప్పలు

Latest Suryapet News