మన ఊరు మనబడి పనులు వెగవంతంగా పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మొదటి ఫేసులో గుర్తించబడిన 329 పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు, టాయిలెట్లు,ప్రహరీ గోడ, కిచెన్ షేడ్ నిర్మాణ పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ఎస్.

వెంకట్రావ్ ఆదేశించారు.

గురువారం జిల్లా కలెక్టరెట్ సమావేశ మందిరంలో మనఊరు మనబడి పనుల ప్రగతిపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశానికి అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ కలిసి ఆయన సమీక్షించారు.అనంతరం జిల్లాలో చింతలపాలెం, గరిడేపల్లి,హుజూర్ నగర్, మేళ్లచెరువు,చిలుకూరు, తిరుమలగిరి మండలాల్లో మన ఊరు మనబడి కార్యక్రమం పనులు మందకొడిగా జరుగుతున్నాయని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఎంఈఓ లను కారణాలను అడిగి తెలుసుకుని,మన ఊరు మనబడి పనులపై పాఠశాలల వారీగా సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే 20వ తేదీ కల్లా అన్ని పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు.పాఠశాలలకు సెలవు రోజుల్లో ఎంఈఓ,స్కూల్ హెచ్ఎం అందుబాటులో ఉండాలని,మన ఊరు మనబడి పనులకు పూర్తి సహకారం అందించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్,జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి టి శ్రీనివాస్ రెడ్డి,టిఎస్ ఈ డబ్ల్యూ ఐడిసి ఇంజనీరింగ్ ఈఈ రాంచందర్,డిఈ రమేష్ కూమార్,మండల ఎంఇఓలు,ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News