సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు పెళ్లి, విడాకులు అనేటివి మామూలే.పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే విడాకులు ఇచ్చుకొని మళ్లీ వేరే పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు.
ఇప్పటికీ చాలామంది నటీనటులు తమ పెళ్లిల విషయంలో బాగా హాట్ టాపిక్ గా మారారు.చాలావరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటీనటుడు చాలామంది ఉన్నారని చెప్పాలి.
ఇక అందులో ఒకరు నాగర్జున.( Nagarjuna ) అయితే నాగార్జున తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి కారణం ఒకటుందని తెలిసింది.మరి ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నాగార్జున గురించి అందరికీ పరిచయమే.
తెలుగు సినీ ఇండస్ట్రీలో మన్మధుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నటుడు నాగార్జున.ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరో గా నిలిచాడు.
ఎప్పుడో సినిమాల్లోకి అడుగు పెట్టిన నాగార్జున ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు.పైగా యంగ్ హీరోలతో పోటీగా నటిస్తున్నాడు.

1986లో విక్రం సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.అదే ఏడాది కెప్టెన్ నాగార్జున సినిమాలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.తొలి సినిమాతోనే మంచి హిట్ ను అందుకోగా ఆ తర్వాత మజ్ను, కలెక్టర్ గారి అబ్బాయి, ఆఖరి పోరాటం, గీతాంజలి, శివ వంటి ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరో గా నిలిచాడు.ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు.
దాదాపు 85 కి పైగా సినిమాలలో నటించాడు నాగార్జున.

వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు రియాలిటీ షోలలో వ్యాఖ్యాతగా చేశాడు.వాణిజ్య ప్రకటనల్లో కూడా చేశాడు.ఇక ప్రస్తుతం వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కు వ్యాఖ్యాతగా( Bigg Boss ) చేస్తున్నాడు.
అన్నపూర్ణ స్టూడియో( Annapurna Studios ) నిర్మాణ సంస్థలో నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడు.కేవలం నటుడిగానే కాకుండా పలు బిజినెస్ లు కూడా చేస్తున్నాడు.
ఇక ఇదంతా పక్కన పెడితే నాగార్జున ఇప్పుడు కూడా అంతే హ్యాండ్సమ్ గా ఉన్నాడు.ఇక ఈయనకు అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే.
ఈ వయసులో కూడా నాగార్జునను ఇష్టపడే అమ్మాయిలు చాలామంది ఉన్నారు.అయితే నాగార్జున వ్యక్తిగత విషయానికి వస్తే.
ప్రస్తుతం ఆయన రెండో భార్యగా అమల ఉన్న సంగతి తెలిసిందే.

అమల కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన నటియే.ఇక వీరికి అఖిల్ పుట్టాడు.అయితే నాగార్జున అమల కంటే ముందు దగ్గుబాటి రామానాయుడు కూతురు శ్రీలక్ష్మిని( Srilakshmi ) పెళ్లి చేసుకున్నాడు.ఇక వీరికి నాగచైతన్య పుట్టాడు.ఇక ఇద్దరు మంచి హోదా ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్లే.దాంతో ఇద్దరు ఏ విషయాల్లో కూడా అసలు రాజీ పడేవారు కాదట.ఇక లక్ష్మి ప్రతి విషయంలో తనదే పై చేయిగా ఉండాలని భావించేదట.
అయితే నాగార్జున హీరో కాకముందు అమెరికాలో సివిల్ ఇంజనీరింగ్ చేసి ఎటువంటి ఉద్యోగం చేయకుండా సినిమాలలో నటుడుగా ఒక గుర్తింపు తెచ్చుకోవాలని అడుగు పెట్టాలని అనుకున్నాడట.కానీ శ్రీలక్ష్మి కి మాత్రం తన భర్త సినిమాలలో ఉండటం ఇష్టం లేదని.
దీంతో అమెరికాకు వెళ్లి అక్కడే సెటిల్ అవ్వాలని కోరిక ఉండేదట.కానీ నాగార్జున తనకు నటన మీద ఉన్న ఆసక్తితో లక్ష్మీ నిర్ణయానికి నో చెప్పాడట.
అలా నాలుగేళ్ల పాటు వారి మధ్య ఇవే గొడవలు జరిగాయట.దీంతో చివరికి 1990లో విడాకులు తీసుకొని ఎవరి జీవితం వాళ్ళది అన్నట్లుగా ఉన్నారని తెలిసింది.








