ట్రాక్టర్ ప్రమాదంలో వ్యక్తి మృతి

సూర్యాపేట జిల్లా:రాళ్ళ లోడుతో వస్తున్న ట్రాక్టర్ ట్రక్ లింక్ బెడ్ విడిపోవడంతో ఇంజన్ పైకి లేచి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి స్టీరింగ్ గుద్దుకొని అక్కడిక్కడే మృతి చెందిన విషాద ఘటన మోతె మండలం ఉర్లుగొండ గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉర్లుగొండ గ్రామానికి చెందిన దళితుడు గుల్ల ఘటేశ్వర్లు(25) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.

శనివారం ఉదయం 7 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ ఓనర్ మండవ రామ్మూర్తి ఘటేశ్వర్లు ఇంటికెళ్లి ట్రాక్టర్ వేసుకుని వెళ్లి,గ్రామ శివారులో రాయి వేసుకుని రావాలని చెప్పగా,మండవ రామ్మూర్తికి చెందిన మహీంద్రా ట్రాక్టర్ వేసుకొని వెళ్లి రాయి లోడుతో తిరిగి వస్తుండగా ట్రాక్టర్ ట్రక్ లింక్ ఒక్కసారిగా విడిపోయి ఇంజన్ అమాంతం పైకి లేవడంతో స్టీరింగ్ గుద్దుకొని ఘటేశ్వర్లు మృత్యువాత పడ్డాడు.ఇదే విషయమై ఇన్షూరెన్స్ లేని ట్రాక్టర్ ను తన భర్తకు ఇచ్చి,తన భర్త మరణానికి కారణమైన మండవ రామ్మూర్తిపై కేసు నమోదు చేసి,తనకు న్యాయం చేయాలని మృతుని భార్య గుల్ల ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నట్లు మోతె ఎస్ఐ తెలిపారు.

Bourbon Larchambault : Vue D'ensemble Et Fonctionnalités Pour Les Débutants

Latest Suryapet News