వడ దెబ్బతో వ్వక్తి మృతి

సూర్యాపేట జిల్లా:కోదాడ రూరల్ మండలం రామాపురం గ్రామానికి చెందిన నెలమర్రి యాకోబు (37) వడదెబ్బతో మృత్యువాత పడ్డారు.

దినసరి కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగించే యాకోబు రోజువారీ పనిలో భాగంగా గడ్డి మోపులు కట్టడానికి కూలికి వెళ్లి ఎండకు తాళలేక నీరసంగా ఇంటికి చేరుకున్నాడు.

అదే సమయంలో తన రెండవ కూతురు అనారోగ్యంతో ఉండటంతో ఆమెను కోదాడ హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స చేయించుకొని వచ్చాడు.అదే రోజు తన పెద్ద కూతురు నడిగూడెం గురుకుల పాఠశాలలో చదువుతుండగా,పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో ఆమెను తీసుకురావడాని ఎండలోనే కోదాడ నుండి నడిగూడెం ఆటోలో బయలుదేరాడు.

పొద్దంతా ఎండలో తిరగడం కారణంగా మళ్ళీ కాళ్ళు చేతులు లాగుతుందటంతో నడిగూడెం ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లి చూపించుకున్నాడు.అతన్ని పరీక్షించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం కోదాడ వెళ్లాలని సూచించడంతో కోదాడకి వెళ్తుండగా పరిస్థితి విషమించి మార్గమధ్యంలోనే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అతనికి భార్య,ముగ్గురు కూతుర్లు ఉన్నారు.రెక్కాడితే డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన యాకోబు మరణంతో ఆ కుటుంబం వీధిన పడిందని,ప్రభుత్వం వారి కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని ఆదుకోవాలని బంధువులు, స్థానికులు కోరుతున్నారు.

Advertisement
Pougues Les Eaux : Bonus Et Promotions Expliqués Pour Les Joueurs Avertis

Latest Suryapet News