ఆలేరు అండర్ పాస్ సాధనకై మహాధర్నా,వంటావార్పు

యాదాద్రి భువనగిరి జిల్లా:ఆలేరు పట్టణ నడిబొడ్డున ఉన్న రైల్వే అండర్ పాస్ గత 4 సంవత్సరాలనుండి పెండింగులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం రైల్వేశాఖ నిర్మించవలసిన అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించి సుమారు 4 సంవత్సరాలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన ఆర్ అండ్ బీ వర్క్ పెండింగ్ లో ఉంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్,బీజేపీ నాయకులు పడాల శ్రీనివాస్ మరియు బీజేపీ నేత సూదగాని హరిశంకర్ గౌడ్ ఆరోపించారు.

సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో రైల్వే అండర్ పాస్ సాధనకై మహాధర్నా చేపట్టి,వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలేరు రైల్వే అండర్ పాస్ వర్క్ చేయించడంలో స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.

ఈ అండర్ పాస్ విషయంలో అనేక ఆందోళనాత్మక కార్యక్రమలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం ఆయన చేతకానితన్నానికి నిదర్శనమని అన్నారు.ఇకనైనా టీఆర్ఎస్ ప్రభుత్వ కండ్లు తెరిపించి తక్షణమే అండర్ పాస్ నిర్మాణం ప్రారంభిచేలా ఎమ్మెల్యే కృషి చేయాలని డిమాండ్ చేశారు.

ఈ మహాధర్నా కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు బడుగు జహంగీర్, మండల అధ్యక్షులు దూసరి రాఘవేంద్ర,అసెంబ్లీ కన్వినర్ చిరిగే శ్రీనివాస్,పట్టణ ప్రధాన కార్యదర్శులు పులిపలుపుల మహేష్,కటకం రాజు,ఉపాధ్యక్షులు జెట్ట సిద్దులు,కళ్లెం రాజు,ఎలగందుల రమేష్,మరియు వివిధ మండల&పట్టణ నాయకులు,పదాధికారులు,కార్యకర్తలు,ఆలేరు పట్టణ ప్రజలు,నిర్వాసిత కుటుంబాలు,కుల సంఘాలు,వాణిజ్య వ్యాపార వర్గాలు,మహిళలు,యువకులు,కార్మికులు,కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
సోషల్ మీడియాపై నిఘా:జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

Latest Suryapet News