గేదె దూడపై చిరుత దాడి.. భయాందోళనలో రైతులు

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో చిరుతపులి కలకలం రేపింది.

గోరిలాల్వ నల్లగుంట ప్రాంతంలోని చిట్టపురం గంగధర్ అనే రైతుకు చెందిన గేదెదూడపై దాడి చేసి చిరుతపులి చంపినట్లు తెలిపారు.

గేదె దూడను గుడిసెలో కట్టేసి ఉంచామని రాత్రి సమయంలో చిరుత దాడి చేసి చంపిందని రైతు తెలిపాడు.గుడిసె చుట్టూ చిరుత కాలి వెలిముద్రలు కనిపించాయని తెలిపాడు.

సంవత్సరం పాటు కాపాడుకున్న లేగా దూడను చిరుత చంపడంతో రైతు ఆవేదనకు గురయ్యాడు.నల్లగుట్ట ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుందని ఆ ప్రాంత రైతులు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News